దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన ఘతన ముఖ్యమంత్రి జగన్‌దో అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని రత్తకన్న గ్రామం పరిధిలో వైఎస్సార్ - జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్నామని చెప్పారు.
ప్రతి ఇంటి నిర్మాణానికి 1.80 లక్షల ఆర్థిక సాయం చేయటంతో పాటు ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.