రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టి అమలు చేయనున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 1 న జిల్లాలోని నరసన్నపేట నుంచి ప్రారంభిస్తారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్‌తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు సోమవారం నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానం పరిశీలించారు.
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సన్నాహకాలు - srikakulam district
రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాటు ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది.
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సన్నాహకాలు