ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా నేతలు నిరసన తెలిపారు. హస్తినలో ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు మద్దతుగా దీక్ష చేపట్టారు. టెక్కలిలోని అంబేద్కర్ కూడలిలో నల్ల బ్యాడ్జీలు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పార్టీల నేతలు , ఉద్యోగసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు.