'సముద్రం జన్మనిస్తే ...ముఖ్యమంత్రి జగన్ పునర్జన్మనిచ్చారు'
లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకున్న వలస మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చేరుకున్నారు. వారికి ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని మంత్రి ధర్మాన పరిశీలించారు.
గుజరాత్‌కి వెళ్ళిన మత్స్యకార వలస కార్మికులు శనివారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లాకు చేరుకోగా అధికార యంత్రాంగం వారికి స్వాగతం పలికింది . నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 600 మందికి అవాసం కల్పించారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ సముద్రం జన్మనిస్తే ...ముఖ్యమంత్రి జగన్ మత్స్యకార వలస కార్మికులకు పునర్జన్మనిచ్చారన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించి రెండు వేల వంతున ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే కరోనా వైరస్ కట్టడి చేయగలుగుతున్నామన్నారు.