గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 80 శాతం పంచాయతీ స్థానాల్లో వైకాపా మద్దతుదారులే విజయం సాధించారని తెలిపారు. కొన్ని చోట్ల వైకాపాకు చెందిన నాయకులు పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కాకుండా ప్రత్యర్థులకు సహకరించారన్నారు. అన్ని గమనిస్తున్నామని.., వారందరికి సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో వెన్నుపోట్లను ఉపేక్షించబోమని హెచ్చరించారు.
'వెన్నుపోటుదారులు మూల్యం చెల్లించుకోక తప్పదు' - ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ న్యూస్
క్రమశిక్షణ కలిగిన వైకాపాలో వెన్నుపోట్లను ఉపేక్షించబోమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
'వెన్నుపోటుదారులు మూల్యం చెల్లించుకోక తప్పదు'
TAGGED:
ధర్మాన కృష్ణదాస్ న్యూస్