ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుండపోత వర్షం.. అపార పంట నష్టం - శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర పంట నష్టం

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 8 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చేతికి వచ్చిన పంట వర్షాలకు తీవ్రంగా నష్టపోయిందని రైతులు ఆందోళన చెందుకున్నారు.

By

Published : Oct 13, 2020, 9:37 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మనగగా... భారీగా పంట నష్టం జరిగింది. నియోజకవర్గంలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగాడం మండలాల్లో సుమారు 8 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, పత్తి, బొప్పాయి, వరి, అరటి, మిరప, చెరకు తదితర పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఈదురు గాలులు బీభత్సనికి పలు పంటలు నేలమట్టమైయాయి.

ఆదుకోవాలి.. !

ఖరీఫ్ సాగు ప్రారంభంలో వర్షాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల సగానికిపైగా పంటలకు నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మిగిలిన కూడా పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చిన పంట వర్షాలకు తీవ్రంగా నష్టపోయిందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details