ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు - ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో కరోనా పరీక్షలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీ నగర్​లోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన ఓ టీచర్​తోపాటు నలుగురు విద్యార్థులకు వైరస్ సోకడంతో మిగిలిన విద్యార్థులకు పరీక్షలు చేయించారు.

Corona test at amadalavalasa govt school
ఆమదాలవలస ప్రభుత్వ పాఠశాలలో కరోనా పరీక్షలు

By

Published : Aug 31, 2021, 3:54 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీ నగర్​లోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో.. విద్యార్థులకు కొవిడ్ పరీక్ష నిర్వహించారు. పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడికి కొవిడ్ సోకడంతో సిబ్బంది, టీచర్లు, పలువురు విద్యార్థులకు టెస్టులు నిర్వహించగా.. నలుగురు విద్యార్థులకు పాజిటివ్​గా తెలింది. దీంతో విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

పదకొండు వందల మంది పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు చింతడ నారాయణ రావు తెలిపారు. పాఠశాలలో ప్రస్తుత పరిస్థితిని మున్సిపల్ కమిషనర్​తోపాటు విద్యాశాఖ అధికారులకు వివరించినట్లు చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details