శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ ఆసుపత్రిగా ఉన్న జెమ్స్‌లో విధులు పూర్తిచేసుకున్న వైద్యులు, సిబ్బందిని.. అక్కడి ఇతర సిబ్బంది, అధికారులు హర్షధ్వానాలతో అభినందించారు. మొదటి విడతగా కొవిడ్ విధులు నిర్వహించి 38 మంది వైద్యులు, సిబ్బంది.. నేడు రిలీవ్ అయ్యారు. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ కారణంగా వీరిని క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ వారికి చప్పట్లతో స్వాగతం పలికారు.
వైద్యులు, సిబ్బందికి హర్షధ్వానాలతో అభినందనలు - శ్రీకాకుళంలో కరోనా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడతగా కొవిడ్ వైద్య సేవలు అందించిన 38 మంది వైద్యులు, సిబ్బంది.. నేడు రిలీవ్ అయ్యారు. వీరందరినీ హర్షధ్వానాలతో అంతా అభినందించారు.
వైద్యులు, సిబ్బందికి హర్షధ్వానాలతో అభినందనలు