శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామానికి చెందిన ఓ పశువైద్యాధికారికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. స్థానిక తహసీల్దార్ కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో బాధితుడిని శ్రీకాకుళంలోని కొవిడ్ వైద్యశాలకు పంపించారు. అతను నివాసం ఉన్న ప్రాంతంలో క్రిమినాశక ద్రావణాలు పిచికారీ చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొరసవాడలో పశువైద్యాధికారికి కరోనా పాజిటివ్ - శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు
రాష్ట్రంలో కొవిడ్ ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా కేసులు నమోదు కాకుండా గ్రీన్ జోన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాపై మహమ్మారి పడగ విప్పుతోంది. జిల్లాలోని కొరసవాడలో ఓ పశువైద్యాధికారికి పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపింది.
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న వైద్య సిబ్బంది