శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం 4వ వార్డు గేదెలవానిపేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించామని, ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయనున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా గేదెలవానిపేటలో ఒకరికి కరోనా పాజిటివ్ - కరోనా పాజిటివ్ నిర్ధారణ వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిన కారణంగా అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ సూచించారు.
ఆముదాలవలసలో కరోనా పాజిటివ్ నిర్ధారణ