ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Collector Inspection: కూలిన వంతెనను పరిశీలించిన కలెక్టర్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు

Collector Inspects Collapsed Bridge: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కూలిపోయిన వంతెనను కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పరిశీలించారు. తాత్కాలిక బ్రిడ్జ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Collector Inspection
కలెక్టర్ పరిశీలన

By

Published : May 4, 2023, 3:33 PM IST

Collector Inspects Collapsed Bridge: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం బహుదా నది వంతెనపై భారీ గ్రానైట్ లోడుతో వాహనం వెళ్లిన కారణంగా వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ కూలిపోయిన వంతెనను పరిశీలించారు. వంతెన ఎలా కూలిందో, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయో? అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులతో అక్కడే సమీక్షించారు. వెంటనే తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల నిధుల్లో భాగంగా నిధులు వెంటనే మంజూరు చేసుకున్నానని.. వెంటనే నాణ్యతతో కూడిన, రక్షణతో ఉండే వంతెనను నిర్మించాలని జిల్లా ఆర్అండ్​బీ అధికారులను ఆదేశించారు.

ప్రమాదకరంగా ఉన్న వంతెనలపై దృష్టి పెట్టాలని సూచించారు. పనుల నాణ్యతలో, సేఫ్టీలో తేడాలు ఉంటే ఆ బాధ్యత సంబంధిత అధికారులే భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నూతనంగా శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయని, నూతన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న వంతెనల జాబితాను మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ జిల్లా కలెక్టర్​కు వివరించారు.

Collector Inspection: కూలిన వంతెనను పరిశీంచిన కలెక్టర్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు

"వాహనాలు వెళ్తున్న సమయంలో ఎక్కువ బరువు వలన.. బహుదా నదిపై ఉన్న వంతెన కిందకి దిగిపోయిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణహాని జరగలేదు. వారంలోపు ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడానికి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆర్ అండ్ బీ అధికారులతో చర్చిస్తున్నాము. అదే విధంగా ఇటువంటి బ్రిడ్జ్​లు జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా ఒక జాబితా తయారుచేస్తున్నాం". - శ్రీకేష్‌ లఠ్కర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్

వంతెన గురించి వివరాలు:బహుదా నదిపై వంతెనను 1929వ సంవత్సరంలో నిర్మించారు. ఈ వంతెన బాగా శిథిలమైనప్పటికీ కొన్ని దశాబ్దాలుగా అధికారులు మరమ్మతులు చేస్తూ వచ్చారు. అధికారులు మరమ్మతులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు కానీ.. కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం వాసులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదు.

అక్రమ ఇసుక తవ్వకాలే కారణమా?: వంతెన కూలడానికి ప్రధాన కారణం నదిలో అక్రమ ఇసుక తవ్వకాలనేనని స్థానికులు అంటున్నారు. వంతెన పిల్లర్స్ వద్ద ఇసుకను కూడా తవ్వడం వలనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై అనేక సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలడంతో.. పలాస, ఇచ్ఛాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details