ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇక నుంచి ప్యాకెట్లల్లో కాదు.. తూనిక వేసి ఇస్తాం'

ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసే నిత్యావసర సరుకులను కొత్త పద్ధతిలో తూనిక వేసి పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ఇలా చేయడం ద్వారా నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వాహనం ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు.

civil supply
పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్

By

Published : Mar 3, 2021, 9:57 AM IST

నిత్యావసర సరుకుల పంపిణీలో తలెత్తుతున్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. ఆమదాలవలస మండలంతో పాటు శ్రీకాకుళంలోని హడ్కోకాలనీ, రెళ్లవీధిని ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రాంతాల్లో వాహనం ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతున్న తీరును వాహన ఆపరేటర్, వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రెవెన్యూ డివిజనల్, పౌర సరఫరాలశాఖ సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం నిర్వహించామన్న శశిధర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేపట్టినట్టు చెప్పారు. గతంలో ప్యాకెట్ల రూపంలో పంపిణీచేసే విధానాన్ని మార్పు చేసి.. ప్రస్తుతం కొత్త ఫార్మాట్‌లో తూనిక వేసి అందించడం జరుగుతోందన్నారు. తద్వారా నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details