మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ స్వర్ణకళాకారుడు తన కళతో శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన జగదీష్. చిరంజీవి చిత్రాన్ని వెండిపై చేతితో చెక్కి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించి.. ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన మెగాస్టార్‌పై అభిమానంతో దీనిని తయారు చేసినట్లు తెలిపారు.
MEGASTAR BIRTHDAY: బర్త్‌డే స్పెషల్..వెండితో చిరంజీవి చిత్రం
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన జగదీష్.. చిరంజీవి చిత్రాన్ని వెండిపై చేతితో చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించి.. ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిపై అభిమానంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనిని తయారు చేసినట్లు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని వెండిపై చెక్కిన జగదీష్
6 గ్రాముల మేలిమి వెండిపై.. సూక్ష్మరూపంలో చిరంజీవి చిత్రం తయారు చేయడానికి సుమారు 60 నిమిషాలు సమయం పట్టిందని తెలిపారు. దీనిని త్వరలో చిరంజీవికి అందించనున్నట్లు జగదీష్ తెలిపారు.