కాశీలో లింగం... గంగలో స్నానం... శ్రీశైలంలో శిఖరం... శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే... మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. అంతటి ప్రాశస్త్యం ఉన్న శైవక్షేత్రాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలసిన శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం.. ఈ శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో చక్రతీర్థ స్నానాలు అంత్యంత వైభోపేతంగా జరగడం అనవాయితీ. నేడుశివయ్యకు ప్రత్యేక పూజలతో చక్రతీర్థ కార్యక్రమాలు ప్రారంకానున్నాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో ఒకటి తక్కువ కోటి లింగాల క్షేత్రంగా పిలుస్తారు. ప్రాచీన శిల్ప సంపద ఉన్న దేవాలయంగా పెరోందింది... ఈ శైవక్షేత్రం. ఆలయానికి నలువైపుల 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రాంతాల్లో శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయాల్లో నల్లరాతి లింగాలు చూపరులను కనువిందు చేస్తాయి.మహాశివరాత్రి పర్వదినాల్లో , స్వామి వారి కళ్యాణానికి విశేషంగా భక్తులు వస్తుంటారు. ఆలయ వెనుక భాగానే పవిత్ర వంశధారనదిలో చక్రతీర్థ స్నానాలు వైభవంగా జరగనున్నాయి. దేవాలయం నుంచి పార్వతీపరమేశ్వరుల ఉత్సవమూర్తులను అలంకరించి నంది వాహానంపై ఊరేగింపుగా వంశధార నదీ తీరానికి తీసుకువస్తారు. అక్కడ స్వామి వారితోపాటు భక్తులు చక్రస్నానాలు చేస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. ఆ వేడుకలో వంశధార నదీ తీరం శివనామస్మరణంతో మారు మోగుతుంది.శ్రీముఖలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలుఏర్పాట్లు చేశారు. లక్షల్లో భక్తులు వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.