ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రన్నాయుడు, మోహన్ రెడ్డికి.. చంద్రబాబు, లోకేశ్ నివాళి - ఎర్రన్నాయుడికి చంద్రబాబు నివాళి

దివంగత నేతలు ఎర్రన్నాయుడు, బీవీ మోహన్ రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్మరించుకున్నారు. వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఎర్రన్నాయుడు, మోహన్ రెడ్డిలకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

By

Published : Nov 2, 2019, 2:07 PM IST

ఎర్రన్నాయుడు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి దిల్లీ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన వర్థంతి సందర్భంగా ట్విటర్​లో నివాళులు అర్పించారు. తన కంచు కంఠంతో చట్టసభలలో తెలుగు ప్రజావాణిని బలంగా వినిపించారని, ఆయన స్ఫూర్తితో ప్రజాసమస్యలపై పోరాటానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి మోహన్ రెడ్డి జయంతి సందర్భంగా.. ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేశ్ గుర్తు చేసుకున్నారు. తెదేపా సీనియర్ నేతగా, అయిదుసార్లు శాసనసభ్యునిగా పనిచేసిన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కీర్తించారు.

మోహన్ రెడ్డిలకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

ABOUT THE AUTHOR

...view details