ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cases Booked On Anganwadi Workers: 28 మంది అంగన్​వాడీ కార్యకర్తలపై కేసు నమోదు.. - Anganwadis

శ్రీకాకుళం జిల్లాలో 28 మంది అంగన్​వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన కార్యకర్తలు గత నెల 3న బత్తిలి చెక్​పోస్టు వద్ద చిన్నపిల్లలు, గర్భిణులు పంపిణీ చేయాల్సిన పాలప్యాకెట్లను అక్రమంగా తరలిస్తుండంగా పోలీసులు పట్టుకున్నారు. తాజాగా వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

cases booked on Anganwadis
cases booked on Anganwadis

By

Published : Aug 15, 2021, 12:36 AM IST

Updated : Aug 15, 2021, 1:18 AM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్​వాడీ కార్యకర్తలపై బత్తిలి పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 3వ తేదీన బత్తిలి చెక్​పోస్టు వద్ద చిన్నపిల్లలు, గర్భిణులు పంపిణీ చేయాల్సిన పాలప్యాకెట్లను అక్రమంగా తరలిస్తుండంగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు.. 28 మంది అంగన్‌వాడీ కార్యకర్తలపై 409, 406, 420, 411, 955 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

కొత్తూరు మేజిస్ట్రేట్ కోర్టులో వీరందరినీ హాజరుపరచగా.. ఈనెల 27వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంగన్​వాడీ కార్యకర్తలను అంపోలులోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. దీనిపై వారిని ప్రశ్నించగా భిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తమకేమీ తెలియదని, సూపర్‌వైజర్లు, సీడీపీవోలు చేయమంటేనే చేశామని అంగన్​వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Last Updated : Aug 15, 2021, 1:18 AM IST

ABOUT THE AUTHOR

...view details