శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో తెదేపా కార్యకర్త కోన వెంకటరావుది ముమ్మాటికీ హత్యేనని..... అందుకు కారణమైన మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, డీఎస్పీ శివరామిరెడ్డి ని కచ్చితంగా జైలుకు పంపిస్తామని తెదేపా నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. కోన వెంకటరావు కుటుంబ సభ్యులను గౌతు శిరీషతో కలిసి బుద్ధా వెంకన్న పరామర్శించారు. వెంకటరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరుఫున రూ.2 లక్షలు, బుద్ధా వెంకన్న రూ.50 వేలు, గౌతు శిరీష రూ.50 వేలు బాధిలకు అందతులకు అందజేశారు.
కోన వెంకటరావుది ముమ్మాటికీ హత్యే : బుద్ధా వెంకన్న - srikakulam district news
శ్రీకాకుళం జిల్లాలో తెదేపా కార్యకర్త కోన వెంకటరావుది ముమ్మాటికీ హత్యేనని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. అందుకు కారణమైన మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, డీఎస్పీ శివరామిరెడ్డి ని కచ్చితంగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.కోన వెంకటరావు కుటుంబ సభ్యులను గౌతు శిరీషతో కలిసి బుద్ధా వెంకన్న పరామర్శించారు.
Buddha Venkanna