ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన వీఆర్​ఓ

భూమి వివరాలు సవరించేందుకు హోంగార్డు నుంచి 5 వేలు లంచం తీసుకుంటుగా శ్రీకాకుళం జిల్లా యారబాడు వీఆర్ఓను  అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన  వీఆర్​ఓ

By

Published : Jul 5, 2019, 6:44 AM IST

వెబ్​లాండ్​లో భూమి వివరాలు సవరించేందుకు 5 వేలు లంచం తీసుకుంటుండగా... శ్రీకాకుళం జిల్లా యారబాడు వీఆర్ఓ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. యారబాడు చెందిన హోంగార్డ్ కోటిపల్లి శంకర్రావు తన భూమి సవరణ నిమిత్తం వీఆర్ఓ రాజును సంప్రదించాడు. దానికి 5వేలు లంచం డిమాండ్ చేయగా... శంకర్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద లంచం తీసుకుంటుండగా అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు.

ఏసీబీకి చిక్కిన వీఆర్​ఓ

ABOUT THE AUTHOR

...view details