నేటి నుంచి సత్యమేవ జయతే పేరుతో భాజపా బస్సు యాత్ర నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదలయ్యే యాత్రను జాతీయఅధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు.
ఆంధ్రాకు అమిత్ షా.... - భాజపా బస్సు యాత్ర
నేటి నుంచి సత్యమేవ జయతే పేరుతో భాజపా బస్సు యాత్ర నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదలయ్యే యాత్రను జాతీయఅధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సత్యమేవ జయతే పేరుతో నేటి నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు కన్నా తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల శంఖారావం పలాస సభ నుంచే మొదలవుతుందన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయటం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా కేంద్రం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు.