MP Rammohan Naidu Comments : రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర అరసవల్లి వరకు దిగ్విజయంగా సాగడానికి మా పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని.. తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో సంప్రదాయ కళా గురుకులానికి ఎంపీ నిధుల నుంచి 36 లక్షల రూపాయలు వెచ్చించి బస్సును ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల పేరుతో వైకాపా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఎంపీ ఘాటుగా విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసమే వైకాపా 3 రాజధానుల నాటకం: ఎంపీ రామ్మోహన్ నాయుడు - శ్రీకాకుళం
MP Rammohan Naidu : మూడు రాజధానుల పేరుతో వైకాపా లబ్ధి పొందాలని చూస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఒకే రాజధానితో ముందుకు వెళ్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆయన అన్నారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు
"రాజకీయాలు ఏ రకంగా ఉన్నా ప్రజలు, రైతులు, సామాన్యులను ఇబ్బంది పెట్టడం మన చరిత్రలో లేదు. అటువంటి చెడు సంస్కృతికి వైకాపా కొమ్ము కాస్తోంది. మాకు గొడవలు, రాజకీయాలు వద్దు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. ఒకే రాజధానితో ముందుకు వెళ్లాలనే ఆలోచన చంద్రబాబు నాయుడికి ఆరోజు ఉంది.. ఈ రోజు కూడా ఉంది". - రామ్మోహన్ నాయుడు, తెదేపా ఎంపీ
ఇవీ చదవండి: