ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పీకర్ తమ్మినేనిని సన్మానించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు - శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో క్రికెట్ మైదానం ఏర్పాటుపై ఆంధ్ర క్రికెట్​ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం​ను కలుసుకుని ఆయనను సన్మానించారు. జిల్లాలో క్రికెట్​పై మక్కువ చూపిస్తున్న క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని, క్రికెట్ మైదానం రావడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు.

Andhra cricket association
Andhra cricket association

By

Published : Nov 7, 2020, 7:27 PM IST

Updated : Nov 7, 2020, 8:39 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును హర్షిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం​కు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ్మినేని సీతారాం​ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ... ఒక క్రికెటర్​గా తనవంతు బాధ్యతగా క్రికెట్ అభివృద్ధి కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో కొత్తగా రెండు క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. పులివెందుల, ఆమదాలవలసకు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని ఆయన అన్నారు. రంజీ, స్టేట్, జోనల్​లో ఆడిన క్రికెటర్లు శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది ఉన్నారని చిరంజీవి అన్నారు.

ఆరు నెలల వ్యవధిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసిన సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. గతంలో తమ్మినేని సీతారాం​ క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో... ఆయన సలహాలు, సూచనలు తీసుకుని క్రీడాకారుల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నామన్నారు. శ్రీకాకుళంలో జిల్లా క్రికెట్ అకాడమీ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయటానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని అన్నారు.

ఇదీ చదవండి

'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'

Last Updated : Nov 7, 2020, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details