ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమ్ముకుంటున్న మేఘాలు.. ఎగసిపడుతున్న అలలు - శ్రీకాకుళం జిల్లాలో అంపన్ తుపాను ప్రభావం

శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావంతో చాలా మండలాల్లో సముద్రం ముందుకొచ్చింది. జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.

AMPHAN EFFECT ON SRIKAKULAM DISTRICT
శ్రీకాకుళం జిల్లాలో అంపన్ తుపాను ప్రభావం

By

Published : May 19, 2020, 9:31 AM IST

శ్రీకాకుళం జిల్లాపై అంపన్ తుపాను ప్రభావం చూపుతోంది. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. చిరుజల్లులు పడుతున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, సోంపేట, సంతబొమ్మాళి మండలాల్లో సముద్రం ముందుకు వచ్చింది.

గొట్టా బ్యారేజీ నుంచి అధికారులు నీరు దిగువకు విడుదల చేశారు. కలెక్టర్ నివాస్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే కోసి ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ నంబర్‌- 08942-240557 ను సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details