శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్. శివశంకర్ తెలిపారు. ఆముదాలవలస జూనియర్ కళాశాలలో యంత్రాలను, సిబ్బందిని సిద్ధం చేశారు. సుమారు 3వేల మందిని ఎన్నికల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు మరో 500 మంది సహాయకులను నియమించినట్లు వివరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచామనీ... సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామని తెలిపారు. ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా సిక్కోలు: శివశంకర్ - శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది సహా... ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అన్నీ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. సుమారు 3వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని రిటర్నింగ్ అధికారి శివశంకర్ తెలిపారు.
ఎన్నికలకు సిక్కోలు రెడీ