ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆందోళనకు దిగిన కరోనా అనుమానితులు - pathravalasa corona care center

పెట్టేదే నాణ్యత లేని ఆహారం.. అది కూడా సమయం దాటిన తరువాత అందిస్తున్నారంటూ కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. తమకు సరైన ఆహారం పెట్టాలని... మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస కొవిడ్ సెంటర్​లో జరిగింది.

srikakulam corona patients agitation
ఆందోళనకు దిగిన కరోనా అనుమానితులు

By

Published : Jul 29, 2020, 7:08 PM IST

శ్రీకాకుళం సమీపంలో పాత్రునివలస కొవిడ్ కేర్​లో ఉంటున్న కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. తమకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. సమయం దాటిన తరువాతే ఆహారాన్ని ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మౌళిక సదుపాయాలు కూడా లేవనీ.. సరైన మందులు ఇవ్వటం లేదని వాపోయారు. తమకు నాణ్యమైన ఆహారాన్ని.. సరైన సమయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details