ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్నాయుడిపై ఈఎస్​'ఐ'.. ఏసీబీ ఏం చెబుతుందంటే..? - esi scam news in srikakulam

రాష్ట్రంలో ఈఎస్​ఐ మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అనిశా అధికారులు తెలిపారు. అధికారం అండతో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. కాల్​సెంటర్​, ఈసీజీలకు సంబంధించి ఓ సంస్థతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్​ మెడికల్​ సిబ్బంది సైతం అధికారుల అండతో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశామని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.

అచ్చెన్నాయుడు హయాంలో ఈఎస్​ఐలో జరిగిందిదే..!
అచ్చెన్నాయుడు హయాంలో ఈఎస్​ఐలో జరిగిందిదే..!

By

Published : Jun 12, 2020, 4:34 PM IST

Updated : Jun 12, 2020, 4:51 PM IST

రాష్ట్రంలో 2015 నుంచి 2019 వరకు ఈఎస్​ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేసిన ఏసీబీ అధికారులు అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. దాదాపు రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్ల విలువైన అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేల్చారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అండతో ఈ టెండర్​ పద్ధతిలో కాకుండా నామినేషన్​ బేసిన్​ ద్వారా అధికారులు పలు సంస్థలతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తెలిపారు.

అవినీతి జరిగింది ఇందులోనే

ఈఎస్​ఐ పరికరాల కొనుగోళ్లలో చాలా విభాగాల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

  • నాన్ రేట్ కాంట్రాక్టు మందుల కొనుగోళ్లు
  • ల్యాబ్ కిట్స్ కొనుగోళ్లు
  • సర్జికల్ ఐటమ్స్ కొనుగోళ్లు
  • ఫర్నిచర్ కొనుగోళ్లు
  • బయో మెట్రిక్ డివైస్​ కొనుగోళ్లు
  • కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందం.

అవినీతి జరిగిందిలా..

ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. అప్పటి ప్రజా ప్రతినిధుల అండతో అధికారులు ప్రభుత్వానికి నష్టం కలిగించారని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

  • సర్జికల్​ ఐటమ్స్​ మార్కెట్​ ధర కంటే 50 శాతం నుంచి 129 శాతం ఎక్కువకు మందుల కొనుగోళ్లు.
  • అన్ని కొనుగోళ్లు ఈ - టెండర్​ పద్ధతి ద్వారా కాకుండా నామినేషన్​ బేసిన్​ ద్వారా లోపాయకారి ఒప్పందం చేసుకున్న సంస్థల నుంచి మందుల కొనుగోళ్లు.
  • డీఐఎంఎస్(డైరెక్టర్​ ఆఫ్​ ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీసెస్​)​​ సిబ్బంది కొంతమంది.. వారి కుటుంబ సభ్యులు పేర్ల మీద బినామీ మందుల కంపెనీ పెట్టి అక్రమంగా మందులు కొనుగోలు ఒప్పందాలు చేసుకుని.. బిల్లులు తీసుకున్నారు.
  • డీఐఎంఎస్​​ సిబ్బంది కొంతమంది.. ఫేక్​, ఫోర్జరీ లెటర్​ హెడ్స్​, ఎన్వలప్​ కవర్లు సృష్టించి కొటేషన్స్​ వేసి మందుల షాపుల నుంచి దొంగ బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారు.
  • అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెలీ హెల్త్​ సర్వీస్​ లిమిటెడ్​ అనే సంస్థతో కాల్​ సెంటర్​, టోల్​ ఫ్రీ, ఈసీజీకి సంబంధించి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. అప్పటి ఈఎస్​ఐ డైరెక్టర్​ రమేష్​కుమార్​ సదరు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రక్రియ చాలా స్తబ్ధుగా జరిగింది.
  • ప్రతీ ఈసీజీకి రూ.480 చెల్లించుకున్నారు. అదే ఈసీజీ సర్వీస్​ వేరే ఆస్పత్రిలో రూ.200. ఈసీజీ సేవల కోసం కార్డియాలజిస్ట్ ఎండీకి​ బదులుగా డిప్లొమా చదివిన వారి సేవలు వినియోగించుకున్నారు.
  • ఈఎస్​ఐ కాల్ సెంటర్​లో రిసీవ్ చేసుకొనే కాల్స్​కి కాకుండా సర్వీస్ ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్, ఫేక్ కాల్ లాగ్స్​కి ఒక్కింటికి Rs.1.80 ప్రతీ నెల బిల్ క్లెయిం చేశారు.
  • సెవరేజ్​ ప్లాంట్​, బయో మెడికల్​ వేస్ట్​ డిస్పోసల్​ ప్లాంట్స్​కు సంబంధించి అవకతవకలపై విచారణ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

మొత్తం 19 మంది..

ఈ అక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని అన్నారు.

అరెస్టైన వారి వివరాలు

  • కింజరాపు అచ్చెన్నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే
  • చింతల కృష్ణప్ప రమేష్​ కుమార్​, రిటైర్డ్​ డైరెక్టర్​ ఆఫ్​ ఈఎస్​ఐ
  • డా.గాడి విజయకుమార్​, రిటైర్డ్​ స్పెషల్​ గ్రేడ్​ సివిల్​ సర్జన్​, ఈఎస్​ఐ ఆస్పత్రి, రాజమహేంద్రవరం.
  • డా.వి.జనార్దన్​, రిటైర్డ్​ జేడీ, ఈఎస్​ఐ, కడప.
  • ఇవన రమేష్​బాబు, సీనియర్​ అసిస్టెంట్​, డీఐఎంఎస్​, విజయవాడ.
  • ఎం.కే.పీ.చక్రవర్తి, సూపరింటెండెంట్​, డీఐఎంఎస్​, విజయవాడ.(ప్రస్తుతం సస్పెన్షన్​లో ఉన్నారు)

ఇదీ చూడండి..ట్రెండింగ్​లో 'ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు' హ్యాష్ టాగ్

Last Updated : Jun 12, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details