శ్రీకాకుళం జిల్లా సోంపేట, మందస బీసీ వసతిగృహలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బాలికల వసతి గృహల్లోని విద్యార్థులతో అనిశా డీఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. అక్కడి పరిస్థితులు, సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యారంగానికి కోట్లు ఖర్చు చేస్తున్నా... మౌలిక సదుపాయాల్లో లోపం ఎందుకని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందించటం లేదని మండిపడ్డారు. వసతి గృహం నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు.
బీసీ వసతి గృహంపై అనిశా దాడులు - ఏసీబీ దాడులు తాజా వార్తలు
అవినీతి నిరోధక శాఖ అధికారులు శ్రీకాకుళం జిల్లా సోంపేట, మందస బీసీ బాలికల వసతి గృహలపై దాడులు నిర్వహించారు. సరైన వసతులు అందించటం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనిశా దాడులు