ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో ఆస్పత్రిలో చేర్చారు...కానీ మూడు రోజుల తరువాత...! - rims hospital

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...మూడోరోజు నుంచి ఆచూకీ లభ్యం కానీ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

a person missing from srikakulam
a person missing from srikakulam

By

Published : Aug 10, 2020, 10:29 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పురుషోత్తపురానికి చెందిన ఓ వ్యక్తిని కరోనా పాజిటివ్ పేరుతో వాలంటీర్లు ఆస్పత్రికి తరలించారు. భర్తతో పాటు భార్యను కూడా తీసుకెళ్లారు. చికిత్స అనంతరం భార్య మూడు అనంతరం ఇంటికి చేరింది. ఈక్రమంలో ఇంటి దగ్గర ఉన్న వాళ్లు తండ్రి గురవయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అనుకున్నారు. కానీ గురవయ్య ఆచూకీ లేకుండా పోయింది. ఫొన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో...కుటుంబసభ్యులు ఈనెల 3న రిమ్స్​కు వెళ్లి విచారించారు. 12వ తేదీన చేరిన మాట వాస్తమేనని..మూడు రోజులు చికిత్స కూడా వైద్యులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చాలని కుమారుడు బాలరాజు అధికారులను వేడుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details