శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం బొడ్డపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో... 14 పూరిళ్లు.. అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిరాశ్రయులైన వారు అంతా మత్స్యకార కుటుంబాలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.
అగ్నికి ఆహుతైన 14 పూరిళ్లు - శ్రీకాకుళం బొడ్డపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని 14 పూరిళ్లు దగ్ధమయ్యాయి.
శ్రీకాకుళంలో అగ్నికి ఆహుతైన 14 పూరిల్లు