YCP SEGA IN PENUKONDA : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వైసీపీలో.. అసమ్మతి రోడ్డెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర నారాయణ.. అనుకూల, వ్యతిరేక వర్గాల కుమ్ములాటలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పరాభవం తెచ్చిపెట్టాయి. పెనుకొండలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి పెద్దిరెడ్డి.. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకర నారాయణపై ఫిర్యాదు చేసేందుకు.. ఆయన వ్యతిరేక వర్గీయులు శ్రీకృష్ణదేవరాయల కూడలిలో.. కాపుకాశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ రాగానే ఇరువర్గాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో.. తీవ్ర తోపులాట జరిగింది. అసమ్మతి నేతలు మంత్రి పెద్దిరెడ్డికి చెప్పులు చూపించడం చర్చనీయాంశమైంది.
పెనుకొండలో వైసీపీ అసమ్మతి సెగ.. మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన కార్యకర్తలు - మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు
DISPUTES BETWEEN YCP LEADERS : వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పెనుకొండలో వైసీపీ విస్తృత సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరు అవుతున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
DISPUTES BETWEEN YCP LEADERS