ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాకాలంలోనూ నీటి కష్టాలు.. ఖాళీ బిందెలతో రోడ్డుపై మహిళల బైఠాయింపు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Water Problem In Satyasai District: ఎండాకాలంలో నీటి కష్టాలు సహజమే. కానీ అక్కడి ప్రజలు వర్షాకాలంలోనూ నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దీంతో మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే బోరుబావిలో నీళ్లున్నా విద్యుత్​ మోటారు మరమ్మతుకు గురి కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 31, 2022, 5:16 PM IST

Water Problem In Satyasai District: శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని సుబ్బరాయప్పగారి కొట్టాల గ్రామంలోని గ్రామస్థులు మంచినీటి కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోరుబావి విద్యుత్ మోటారు మరమ్మతుకు గురయ్యింది. వర్షాలతో బోరుబావికి మరమ్మతులు చేయడం కుదరడం లేదు. దీంతో గ్రామపంచాయతీ అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే అందరికీ నీళ్లు సరఫరా చేయాలని స్థానికులు పంచాయతీ సిబ్బందిని కోరారు. గ్రామస్థుల మాట పట్టించుకోకపోవడం వల్ల గ్రామస్థులు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బంది ట్యాంకర్​తో సహా అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నీటి సరఫరా పునరుద్ధరించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులను.. పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించారు.

వర్షాకాలంలోనూ నీటి కష్టాలు.. ఖాళీ బిందెలతో రోడ్డుపై మహిళల బైఠాయింపు

ABOUT THE AUTHOR

...view details