ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తి వైకాపాలో అసమ్మతి గుబులు.. విస్తృతస్థాయి సమావేశానికి భారీ బందోబస్తు - jagan on Puttaparthi Constituency

YSRCP meeting in Puttaparthi Constituency: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైకాపా సమావేశం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివస్తోంది.

YSRCP meeting in Puttaparthi
పుట్టపర్తిలో నేడు నియోజకవర్గ వైకాపా విస్తృతస్థాయి సమావేశం

By

Published : Dec 18, 2022, 4:47 PM IST

Police Traffic restrictions during YSRCP meeting: సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వైకాపా విస్తృతస్థాయి సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది. నిన్న పెనుకొండలో ఏకంగా అసమ్మతి వర్గం మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌పైకి చెప్పులు విసరడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ తరుణంలో ఇవాళ పుట్టపర్తిలో జరిగే సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కంటే పోలీసులే అధిక సంఖ్యలో ఉన్నారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివస్తోంది.

విస్తృతస్థాయి సమావేశంలో ఆందోళనలు జరగకుండా బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details