Case Filed on YCP Leaders: శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో ఈనెల 17న మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన ఘటనలో.. ఐదుగురు వైసీపీ నాయకులపై పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. దీనిలో భాగంగా పెనుకొండ వైసీపీ సమావేశానికి వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డిపై అసమ్మతి నేతలు చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పలు వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. వీరంతా చాలా సార్లు శంకరనారాయణ తీరుపై మంత్రి పెద్దిరెడ్డికి పిర్యాదు చేశారు. అయినా ఎటువంటి చర్యలు లేకపోవడంతో.. అసమ్మతి వర్గం చెప్పులు విసిరారు. తాజాగా వీరిపైన పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా వైసీపీ నాయకులపై కేసు నమోదు.. ఎందుకంటే? - వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
Case Filed on YCP Leaders: మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన ఘటనలో ఐదుగురు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 17న శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డిపై వైసీపీ అసమ్మతి నేతలు చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే శంకరనారాయణపై పలుమార్లు మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడమే కారణంగా తెలుస్తోంది.
మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన వారిని అరెస్టు చేసిన పోలీసులు