BRIDGE WORKS : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెనల పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం నూతన కాలువ-నాగప్పగారిపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెనకు నిర్మాణం పూర్తి కాకుండానే పగుళ్లు వచ్చాయి. ప్యాకేజి 14 కింద చేస్తున్న పనుల్లో భాగంగా నూతన కాలువకు వెళ్లే దారిలో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతుండటంతో గ్రామస్థులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సిద్దారెడ్డి పెద్ద పనుల్లో ఇలాంటివి మామూలే అని సమర్థించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కడుతుండగానే బ్రిడ్జికి పగుళ్లు.. సాధారణమే అన్న ఎమ్మెల్యే - ap latest news
BRIDGE WORKS : ఏదైనా వంతెనలు నిర్మిస్తున్నప్పుడు అందులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం సహజం. అయితే కొద్దిమంది మాత్రం డబ్బుకు ఆశపడి నాసిరకం వాటితో తూతూ మంత్రంగా కానిస్తారు. కానీ ఇక్కడ మాత్రం బ్రిడ్జి కట్టడం పూర్తి కాకుండానే పగుళ్లు ఏర్పాడ్డాయి. అయితే వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చెప్పిన సమాధానం అందరూ అవాక్కయ్యేలా చేసింది.
BRIDGE WORKS