Masjid Committee:వైకాపా నాయకుల జోక్యంతో హిందూపురం మసీదు కమిటీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. జామియా మసీదు కమిటీ ఎన్నికల్లో తన వారికి చోటు కల్పించేందుకు వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రయత్నించారని ముస్లింలు అంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. జామియా మసీదు పరిసరాల్లో పోలీసులను మోహరించారు. మసీదు కమిటీ ఎన్నికలపై కోర్టును ఆశ్రయిస్తామని.. అధికార పార్టీ వారికే పదవులు కట్టబెట్టిన తీరును సహించేది లేదని ముస్లిం నాయకులు చెబుతున్నారు. ఎంతో ఐక్యతగా ఉండే ముస్లింలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మసీదు కమిటీ ఎన్నికల్లో.. రాజకీయం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీపై ఆరోపణలు - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
Masjid Committee: జామియా మసీదు కమిటీ ఎన్నికల్లో తన వారికి చోటు కల్పించేందుకు వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రయత్నించారని ముస్లింలు అంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... జామియా మసీదు పరిసరాల్లో పోలీసులను మోహరించారు.
హిందూపురం మసీదు కమిటీ ఎన్నికల్లో.. రాజకీయం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై ఆరోపణలు