MLA beats volunteer: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని తుంగోడు గ్రామపంచాయతీ పరిధిలో గల కావేటినాగేపల్లి, కొలిమిపల్లి గ్రామాల్లో మంగళవారం పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లు, పింఛను, సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలని కోరుతూ గడప గడపలో ఎమ్మెల్యేకు ప్రజలు విన్నవించారు.
గడప గడప కార్యక్రమంలో కావేటి నాగేపల్లి గ్రామంలో వాలంటీర్ రామచంద్రరెడ్డిపై ఎమ్మెల్యే చేసుకోవటం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేపై వాలంటీర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. నాయకులు, పోలీసులు.. వాలంటీర్ కుటుంబ సభ్యులకు సర్దిచెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసమే 20వ తేదీన సోమందేపల్లికి చంద్రబాబు వస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టి తన కుమారుడి ముఖ్యమంత్రిని చేయాలనే దురద్ధేశంతోనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.