రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షిలో పర్యటించారు. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం సందర్శనకు వచ్చిన రోజాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అధికారులను అడిగి ఆలయ ప్రత్యేకతలను గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి యునెస్కో తాత్కాలిక గుర్తింపు పొందిన లేపాక్షి ఆలయానికి.. శాశ్వత గుర్తింపు లభించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. శాశ్వత గుర్తింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యచరణ తెలపండి అని ప్రశ్నించగా.. రోజా సమాధానం చెబుతూ.. మీడియా ప్రశ్నకు కార్యచరణ గాలిలో కనిపించేది కాదని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సమాధానం ఇచ్చారు. ఆలయంలోని సమస్యల గురించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గురించి వినతులు వచ్చాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
లేపాక్షి ఆలయానికి శాశ్వత గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నాం: రోజా - లేపాక్షి శాశ్వత గుర్తింపు లభించేలా కృషి
Minister Roja Comments On Lepakshi: యునెస్కోతో తాత్కాలిక గుర్తింపు పొందిన లేపాక్షి ఆలయానికి శాశ్వత గుర్తింపు లభించేలా చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రత్యేకతల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి ఉత్సవాలు యధావిధిగా జరిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి రోజా తెలిపారు..
కోవిడ్ కారణం వల్ల స్తబ్దత నెలకొని లేపాక్షి ఉత్సవాలు నిర్వహించలేకపోయామని తెలిపారు. ఇకపై లేపాక్షి ఉత్సవాలు యథావిధిగా జరిపేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం చేపట్టిన లేపాక్షి ఉత్సవాల కార్యక్రమాలకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారని మీడియా ప్రశ్నించగా.. మీకు కూడా ఏమైనా బిల్లులు పెండింగ్లో ఉన్నాయా? అంటూ వ్యంగంగా సమాధానం చెప్పారు. మంత్రి రోజా పర్యటనలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి నాయకులు పాల్గొనకపోవడంతో స్థానిక కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు.
ఇవీ చదవండి: