రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాల పర్వం కొనసాగుతూనే ఉంది. రోజు ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఏళ్ల బాలికపై నలుగు మానవమృగాలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీ సత్య సాయి జిల్లా తలుపుల మండలంలో దారుణం జరిగింది. నలుగురు కామాంధులు పశువుల కాపరిగా వెళ్లే... 15 ఏళ్ల బాలికను బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన బాలిక ఆవులను మేపేందుకు అడవికి వెళ్లేది. ఒంటరిగా ఉన్న బాలికను చూసిన మేకల కాపరి కుమార్ ఓ రోజు బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, నరేంద్ర, సురేష్ ఒకరికి తెలియకుండా మరొకరు బాలికను బెదిరిస్తూ... ఏడాదిగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నారు.