పాపం పిల్లలు.. తప్పిపోయారా.. వదిలించుకున్నారా..! - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
11:45 May 17
పిల్లలను చేరదీసిన పోలీసులు
FATHER: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఒంటరిగా తిరుగుతున్న చిన్నారులను పోలీసులు అక్కున చేర్చుకుని మానవత్వం చాటుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయం సమీపాన ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. అనుమానం వచ్చి స్థానికులు ఆరా తీశారు. పిల్లల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ చిన్నారులను చేరదీసి.. వివరాలు ఆరా తీశారు. వారు హిందూపురానికి చెందినవారీగా.. తల్లిదండ్రుల పేర్లు సీనప్ప, లావణ్యగా తెలిపారు. వీరిలో ఆరాధ్య(5), ప్రత్యు సాయి(4), నితిన్ (18 నెలలు) ఉన్నారు.
ఆకలితో ఉన్న ముగ్గురు చిన్నారులకు పోలీసులు భోజనం పెట్టించారు. చిన్నారులను చేరదీసినందుకు పోలీసులను పలువురు ప్రశంసించారు. పిల్లలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీస్తున్నారు. తండ్రే చిన్నారులను అక్కడ వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల సమాచారం తెలిసే వరకు.. పిల్లలను పుట్టపర్తిలోని హ్యాపీ చిల్డ్రన్స్ హోమ్‌లో ఉంచనున్నట్లు సీఐ బాలసుబ్రమణ్యం తెలిపారు.
ఇవీ చదవండి: