YCP Leaders Clash: శ్రీసత్యసాయి జిల్లాలో జరుగుతోన్న వైసీపీ విస్తృతస్థాయి సమావేశాలు కుమ్ములాటకు వేదికలుగా మారుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగాల్సి ఉండగా.. ఆయన అక్కడికి రాకముందే.. ఎమ్మెల్యే సిద్దారెడ్డి , పూలశ్రీనివాసులురెడ్డి వర్గీయులు వేదికపైనే బాహాబాహీకి దిగారు. పూలశ్రీనివాసులురెడ్డి వర్గీయులను వేదికపైకి రానీయకుండా ఎమ్మెల్యే సిద్దారెడ్డి వర్గీయుడు శివారెడ్డి అడ్డుకోవడం గొడవకు దారితీసింది. పూలశ్రీనివాసులు రెడ్డి అనుచరులు శివారెడ్డిని చితకబాదారు. ఓ దశలో ఇరువర్గాలు కుర్చీలతో దాడిచేసుకున్నారు. వేదికంతా చిందరవందరగా చేశారు. అరుపులు, కేకలతో సమావేశ ప్రాంగణం గందరగోళంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి వస్తున్నారంటూ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
పుట్టపర్తిలో కొనసాగుతున్న వైసీపీ కుమ్ములాటలు.. ఈ సారి కదిరి వేదికగా - Peddireddy
YCP Leaders Clash: పుట్టపర్తి జిల్లాలో అధికార వైసీపీ నేతల అంతర్గత కుమ్ములాటలు.. మరింత తీవ్రంగా మారుతున్నాయి. మొన్నటి వరకు సమీక్షల్లో ఒకరిపై ఒకరు వ్యతిరేక వ్యాఖ్యలతో అసంతృప్త గళం వినిపించిన నేతలు, నిన్న ఏకంగా మంత్రి పెద్ద రెడ్డి కాన్వాయ్ పైనే చొప్పులు విసిరారు. తాజాగా కదిరి నియోజక వర్గం సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రాకముందే.. ఒకరికొకరు తోసుకుంటూ, కుర్చీలు విసురుకుంటూ.. వేదికపై గలాట సృష్టించారు.
వైసీపీ నేతల బాహాబాహీ