Man fall in fire pit: శ్రీ సత్యసాయి జిల్లా చెన్న కొత్తపల్లి మండలం బసంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో కనుముక్కల గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి పడి మృతి చెందాడు. బసంపల్లిలో జరుగుతున్న పీర్ల పండుగకు వచ్చిన అతడు.. అగ్నిగుండం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. మంటల్లో కాలిపోతున్న అతనిని స్థానికులు బయటకు లాగారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మద్యం మత్తులో అగ్నిగుండం దగ్గరకు వెళ్లి కాలుజారి గుండంలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం, అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి - మొహరం
Man dead ఓ వ్యక్తి మద్యం మత్తులో పీర్లపండుగ జరుపుకునే ప్రదేశానికి వచ్చాడు. అయితే మందులో మునిగిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది.
MAN DEAD