12 sheep killed in leopard attack: గత కొంత కాలంగా వన్య మృగాలు అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అధికారులు, స్థానికులు ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ.. ఎక్కడో ఒక్క చోట చెదురుమెుదురు ఘటనలు నెలకొంటున్నాయి. అలాంటి ఘటనే శ్రీ సత్య సాయి జిల్లా సి.కే పల్లి మండలం చిన్న మొగలాయపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గొర్రెల మంద మీద చిరుతలు దాడి చేయడంతో.. 12 గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. గ్రామస్థులు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని చిరుతల పాదముద్రలను పరిశీలించారు. చిరుతల దాడిలో గొర్రెలు మృతి చెందడంతో వాటి యజమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిరుతలు సంచరిస్తున్నాయని విషయం తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
చిరుతల దాడిలో 12 గొర్రెలు మృతి.. ఎక్కడంటే.? - శ్రీ సత్య సాయి జిల్లాలో 12 గొర్రెలు మృతి
sheep killed in leopard attack in AP: చిరుతల దాడిలో 12 గొర్రెలు మృతి చెందడం శ్రీ సత్య సాయి జిల్లాలో కలకలం రేపింది. సి.కే పల్లి మండలం చిన్న మొగలాయపల్లి సమీపంలో గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేశాయి. దాడిని గమనించి గట్టిగా కేకలు వేయడంతో.. ఒక గొర్రె పిల్లను నోట కరచుకొని చిరుతలు పారిపోయినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. ఈ ఘటనలో 12 గొర్రెలు మృతి చెందినట్లు కాపర్లు వెల్లడించారు.
చిరుతల దాడిలో 12 గొర్రెలు మృతి