వైఎస్ జయంతి సందర్భంగా.. రైతు దినోత్సవం.. పింఛన్ల పంపిణీ - మార్కాపురం లో వైఎస్సార్ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి.
వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న నాయకులు
ప్రకాశం జిల్లా మార్కాపురం లో వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించారు. గడియారం స్థంభం కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పూల మాలవేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ పెన్షన్ లు పంపిణీ చేశారు. విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.