ప్రజలకిచ్చిన మాట కోసం వైఎస్ఆర్ ఆశయాలతో జగన్ వైకాపాను స్థాపించారని విజయమ్మ అన్నారు.తండ్రి మరణం తరువాత జగన్ఎక్కువ రోజులు ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. ప్రస్తుతప్రభుత్వ హయాంలో అన్యాయాలు, అబద్దాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే... ఈఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా... ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని...అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. జగన్... మోదీ,కేసీఆర్తోకలిసి పని చేయడం లేదని స్పష్టం చేశారు.
'న్యాయానికి-అన్యాయానికి మధ్యే ఎన్నికలు'.. - యర్రగొండపాలెం
ప్రకాశం జిల్లా రెండో రోజు పర్యటనలో భాగంగా.. వైఎస్ విజయమ్మ యర్రగొండపాలెంలో పర్యటించి వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
వైకాపా గౌరవాధ్యక్షురాలు వై ఎస్.విజయమ్మ
ఇవి చూడండి..