ప్రశ్నిస్తే 'దుస్తులూడదీసి కొడతాం' - సామాన్యుల ఆస్థులు ఆక్రమిస్తూ వైసీపీ నాయకుల బెదిరింపులు YCP Leaders Land Grabbing in the State:అవినీతికి కాదేది అనర్హం అన్న చందంగా మారింది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు తీరు. అధికారం చేతిలో ఉంది కదా అని ఖాళీ స్థలం కనపడితే పాగా వేసేస్తున్నారు. ప్రయివేట్ స్థలం అయితే కబ్జా చేసేస్తున్నారు. అది ప్రభుత్వ భూమా.. వాగా, వంకా, కుంటా, చెరువా ఇవేమి వారికి పట్టడం లేదు. ఇష్టారీతిన భూ అక్రమాలకు (YCP leaders land irregularities) పాల్పడుతూ.. యథేచ్ఛగా నకిలీ పత్రాలు సృష్టించేస్తున్నారు. మా భూముల్లో మీ దందా ఏంటని ఎవరైనా యజమానులు ముందుకొస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో తమ భూములను కాపాడి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీని కలిసి మొరపెట్టుకున్నారు.
YCP Leaders Land Grabs: పార్టీ కోసం పదవిని త్యాగం చేస్తే భూకబ్జాలకు పాల్పడుతున్నారు.. ఎమ్మెల్యే ఎదుట వైసీపీ నేత ఆవేదన
దుస్తులూడదీసి కొడతాం, గుండ్లకమ్మలో పడేస్తాం..జిల్లాలోని మార్కాపురంలో భూకబ్జాదారులురెచ్చిపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న స్థలాలు, భూములపై అధికార నేతల కన్ను పడింది. గతంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆన్‌లైన్ చేసుకున్న ఈ ముఠా కళ్లు.. గత నాలుగేళ్లుగా జిరాయితీ భూములు, ఇళ్ల స్థలాలపై పడ్డాయి. నకిలీ పత్రాలను తయారుచేసి.. ఇష్టారీతిన వాగులు, వంకలు, చెరువులను కబ్జా చేస్తున్నారు. మా భూముల్లో మీ దందా ఏంటని ప్రశ్నించిన భూ యజమానులను.. దుస్తులూడదీసి కొడతాం, గుండ్లకమ్మలో పడేస్తాం అని బెదిరిస్తున్నారు.
YSRCP Leaders occupied cattle grazing land పశువుల మేత బీడు భూములను ఆక్రమించిన వైసీపీ నేతలు.. నిరసనకు దిగిన గ్రామస్థులు
అధికార పార్టీ నేతలకే అధికారుల వత్తాసు..వైసీపీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి అండదండలతో జువ్వాజి వెంకట రంగారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, మరికొందరు వ్యక్తులు ఈ అక్రమాలకు పాల్పడుతూ మరో నయీం గ్యాంగ్‌లా తయారయ్యారని వాపోయారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు.. ఒంగోలులో ఎస్పీ మలికా గార్గ్‌కు (SP Malika Garg) ఫిర్యాదు చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, రెవిన్యూ అధికారులను ఆశ్రయించినా అధికార పార్టీ నేతలకే కొమ్ముకాస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
YCP MLA Land Kabja: అడ్డూఅదుపు లేకుండా వైఎస్సార్సీపీ నేతల కబ్జాలు.. ఈసారి రూ.20కోట్ల ల్యాండ్‌పై కన్ను
కోర్టు నుంచి ఆర్డర్లు ఉన్నా ఆగని బెదిరింపులు..కోర్టుకు వెళ్లి అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకున్నా.. స్థలంలోకి వెళ్లకుండా గూంఢాలను పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. అక్రమార్కులు ప్రధానంగా వ్యాపారాల స్థలాలనే లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక జువ్వాజి వెంకట రంగారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డితో పాటు సర్వేయర్ శివశంకర్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని బాధితులు కోరగా ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో మాట్లాడారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.