ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెుక్కల పిలుపులకు పరవశించేందుకు సిద్ధమేనా?

చీరాలలోని ప్రభుత్వ మహిళా కళాశాల.. పచ్చదనానికి చిరునామాగా నిలుస్తోంది. అధ్యాపక బృందం చిత్తశుద్ధికి.. విద్యార్థినుల ఆసక్తి తోడై.. కళాశాలలో ప్రకృతి అందం తాండవిస్తోంది.

చుట్టూ పచ్చదనమే

By

Published : Aug 7, 2019, 3:11 PM IST

చుట్టూ పచ్చదనమే

చుట్టూ ప్రశాంత వాతావరణం... కనులకు విందులు చేసే విరబూసిన పూలు... ఆహ్లాదాన్ని కలిగించే పరిసరాలు. ప్రకాశం జిల్లా చీరాలలోని వైఏ ప్రభుత్వ మహిళా కళాశాల.. ఇలా ఎటు చూసినా ప్రకృతి అందాలతో పరవశింపజేస్తోంది. విద్యతో పాటు పర్యావరణంపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు అధ్యాపకబృందం చేస్తున్న కృషితోనే.. ఇంతటి ఫలితం సాధ్యమైంది.
కళాశాల ప్రధాన భవనం ముందున్న ఖాళీ స్థలాన్ని.. అధ్యాపక బృందం, విద్యార్థినులు ఉద్యావనంగా అభివృద్ధి చేశారు. ప్రతి విద్యార్థినికి ఉచితంగా మెుక్కలు ఇచ్చి నాటించేలా ప్రోత్సహిస్తున్నారు. వారానికొకసారి ప్రతి శనివారం మెుక్కల సంరక్షణకు ప్రత్యేకంగా కేటాయించి, కలుపు మెుక్కలు తీసి బాగోగులు చూసుకుంటారు. కళాశాలలో వచ్చే చెత్తతో స్వయంగా సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
ప్రధానాచార్యులు రమణమ్మ, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు సంతోషికుమారి ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. తాము నాటిన మెుక్కలకు.. పూలు పళ్లు కాస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందన్నారు.. విద్యార్థినులు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details