ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలు అన్ని రంగాలలో సమానత్వం సాధించాలి : న్యాయమూర్తి ఫజులుల్లా

సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆకాక్షించింది. మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో న్యాయ విజ్ఞానం, మహిళా చట్టాలపై అవగాహన కల్పించించింది.

మహిళలు అన్ని రంగాలలో సమానత్వం సాధించాలి : న్యాయమూర్తి ఫజులుల్లా
మహిళలు అన్ని రంగాలలో సమానత్వం సాధించాలి : న్యాయమూర్తి ఫజులుల్లా

By

Published : Oct 17, 2020, 8:54 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్​ కన్వెన్షన్ హాల్ పోలీస్ కల్యాణ మండపంలో మహిళా సాధికారత అనే అంశం మీద జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ సమన్వయంతో న్యాయ రంగం, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 నిబంధనలు ప్రాథమిక హక్కుల పరిరక్షణను నిర్ధారిస్తాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి ఫజులుల్లా పేర్కొన్నారు.

ప్రాథమిక బాధ్యత..

చట్టాల గురించి తెలుసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత భారత పౌరులందరిపైనా ఉందని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి శోభాకుమారి తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా మహిళా సాధికారత, చట్టాల గురించి ప్రాథమికంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

వివాహం, ఆస్తి హక్కులపై అవగాహన..

కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలను అనుసరించి సదస్సును ఏర్పాటు చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. శ్రీనివాసరావు వెల్లడించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్​గా వ్యవహరించిన న్యాయవాది సుమతి, వివాహ సంబంధిత చట్టాలు, మహిళలకు ఆస్తి హక్కు గురించి వివరించారు.

భ్రూణ హత్యలపై..

భ్రూణ హత్యల నిరోధక చట్టం గురించి మరో న్యాయవాది మాధురి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి గాయత్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కర రావు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాలలో సమానత్వం సాధించాలి : న్యాయమూర్తి ఫజులుల్లా

ఇవీ చూడండి :అక్టోబర్ 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం!

ABOUT THE AUTHOR

...view details