ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం రేగుమానుపల్లిలో ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి మౌన దీక్షకు దిగింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్నేళ్లుగా తనను ప్రేమ పేరుతో నమ్మించి... పొదిలి ఆలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నట్లు నమ్మించాడు. అనంతరం తనను గర్భవతిని చేసి, మొహం చాటేశాడని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని యువతి స్పష్టం చేసింది. ఈ మౌన దీక్షకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష - news updates in prakasam district
పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి, గర్భవతిని చేసి మొహం చాటేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... అతడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనదీక్ష చేపట్టింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా రేగుమానుపల్లిలో జరిగింది.
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష