రాష్ట్రంలో నీటి సమస్య ఉన్న అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా దర్శి ఒకటి. వేసవి వచ్చిందంటే అక్కడ నీటికి కటకటే. అందుకే ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్లూరు, పొదిలి మండలాల్లోని గ్రామాలకు ట్యాంక్ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. కనిగిరి మండలంలో ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి 18 గ్రామాలకు నీటి అవసరాలు తీరుస్తున్నారు. ఇప్పటికే మంచినీరు కోసం సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల చేశారు. అలాగే జిల్లాలోని అన్ని మంచినీటి చెరువులను నింపాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఎక్కడైనా నీళ్లను చోరీ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగర్ జలాల సరఫరా ఆగిపోయేలోపు... చెరువులు నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సాగర్ అడుగంటేలోపు చెరువులు నింపే ప్రయత్నం
వేసవి వచ్చింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీటికీ సమస్యే. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది.
నీటి ఎద్దడికి సాగర్ జలాలతో అడ్డుకట్ట