ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 23, 2020, 8:40 AM IST

ETV Bharat / state

'ఆధార్​లో తప్పుడు వివరాలు నమోదు చేస్తే.. కఠిన చర్యలు'

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో స్కాన్ సెంటర్, ఆధార్ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఓ స్కానింగ్​ కేంద్రంపై చర్యలు తీసుకున్నారు.

vigilance officials checkings
విజిలెన్స్ అధికారుల దాడులు

ప్రకాశం జిల్ల విజిలెన్స్ డీఐఓ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు.. చీరాల పట్టణంలో స్కానింగ్ సెంటర్, ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పూర్వి స్కానింగ్ సెంటర్ పై చర్యలు తీసుకున్నారు. అక్కడి కంప్యూటర్, హార్డ్ డిస్క్​తో పాటు కొన్ని డాక్యుమెంట్లను జప్తు చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన 2,500 రూపాయలకే స్కానింగ్ చేయాలనీ.. అధిక ధరలు వసూలు చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మీసేవ, ఆధార్​ కేంద్రాలపై విజిలెన్సు అధికారుల నిఘా ఉంటుందని.. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు తప్పుడు మార్గాల్లో ఆధార్ సెంటర్ల వద్ద పుట్టిన తేదీలు మార్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details