ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొలుసు చోరీ నిందితుడు అరెస్ట్.. ఆభరణం స్వాధీనం - vetapalem police recovered chain from thief

నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసును చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో జరిగిన ఈ ఘటనలో.. 5 సవర్ల బంగారాన్ని నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశారు.

chain snatcher arrest
గొలుసు దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Nov 24, 2020, 9:06 PM IST

ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన నిందితుడు పోలయ్యను.. ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 2 లక్షల విలువైన 5 సవర్ల బంగారు ఆభరణం స్వాధీనం చేసుకున్నారు.

వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో.. ఒక మహిళ మెడలో నుంచి రూ. 2 లక్షల విలువ గల 5 సవర్ల బంగారు గొలుసు, రెండు మంగళ సూత్రాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలయ్య అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 5 సవర్ల బంగారు గొలుసు లభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:భైరవకోన జలపాతం కొలనులో పడి వ్యక్తి మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details